Monday, May 18, 2020

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ..18-05-2020

 తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా నమోదైన పాజిటివ్ 37 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని రాష్ట్ర  శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా నమోదైన పాజిటివ్ (Covid-19) 37 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని రాష్ట్ర  శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,551కి చేరింది. ఆదివారం నాడు 21 మంది కరోనా రోగులు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 34 మంది కరోనా బారిన పడి మరణించగా, ప్రస్తుతం 525 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  మరోవైపు తెలంగాణ మంత్రిమండలి మరోసారి రేపు సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ ఈ భేటీ జరగనుంది. గత కొన్ని రోజులుగా krishna river water dispute కృష్ణ జలాల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముందని సమాచారం. ఇదిలాఉండగా లాక్‌డౌన్ 4.0 కు సంబంధించి కేంద్రం తాజాగా వెలువరించిన మార్గదర్శకాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై, నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. దీనికి తోడు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

No comments: