శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మే ఒకటో తేదీ శుభవార్త. వంట గ్యాస్
ఉపయోగిస్తున్న వారికి భారీ ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర
భారీగా దిగొచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.214 తగ్గింది. అదేసమయంలో
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.336 క్షీణించింది. కొత్త
రేట్లు మే1 నుంచి అమలులోకి వస్తాయి. తాజా ధరల తగ్గింపు నేపథ్యంలో
ఎల్‌పీజీ సిలిండర్ (14 కేజీలు) రూ.583 నుంచి ప్రారంభమౌతోంది. ఇక కమర్షియల్
గ్యాస్ సిలిండర్ ధర రూ.988 నుంచి ఆరంభమౌతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో
క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది.
అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్చి 15 నుంచి వీటిల్లో
ఎలాంటి మార్పు లేదు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి.
నగరాల
వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే.. ఢిల్లీలో ధర రూ.744 నుంచి
రూ.611కు దిగొచ్చింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.839 నుంచి
రూ.774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ.579గా ఉంది. గత నెలలో ధర
రూ.714గా ఉంది. చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.761 నుంచి రూ.569కు
తగ్గింది. ఇక హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.862 నుంచి రూ.796కు తగ్గింది.
వలస కూలీల కోసం నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. లింగంపల్లి నుంచి బయలుదేరిన తొలి రైలు
లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లొచ్చని ప్రకటించిన కేంద్రం..ఇదే విషయాన్ని మంత్రి తలసాని సైతం తెలియజేశారు. తనకు ఫోన్‌చేసిన కేంద్ర
మంత్రి.. వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్టు
తెలియజేశారని వివరించారు. వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని తాము
కేంద్రాన్ని కోరామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రత్యేక రైళ్ల
ద్వారా వలస కూలీలను తరలించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంతో ఈ విషయమై
మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 15 లక్షల మందిని బస్సుల్లో తరలించడం
సాధ్యం కాదు కాబట్టి.. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు
రూపొందించింది. ఇదే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన రైల్వే శాఖ..
ప్రత్యేక రైళ్లను నడపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కారణంగా
దేశవ్యాప్తంగా మే 3 వరకు రైళ్లను నిలిపేసిన సంగతి తెలిసిందే.
వేరే
రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలతోపాటు విద్యార్థులు, పర్యాటకులు,
తీర్థయాత్రలకు వెళ్లిన వారు సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ
కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ వైద్య పరీక్షలు
నిర్వహించాలని.. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత వారిని హోం క్వారంటైన్లో
ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలని
రాష్ట్రాలకు సూచించగా.. ఇప్పటికే పలు రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి.
జూన్ 3వ వారం వరకు లాక్‌డౌన్ కొనసాగింపు?
భారతదేశంలో Lockdown కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జూన్ 3వ వారం వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తేనే మంచిదని. ఆ తర్వాతే లాక్‌డౌన్ ఎత్తివేయాలని రిపోర్టులు సూచిస్తున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు.. జూన్ 3వ వారంలో కరోనా భారత్‌లో పీక్‌స్టేజ్‌కు వెళ్తుందని తన రిపోర్ట్‌లో తెలిపింది. కాబట్టి అప్పటి వరకు లాక్‌డౌన్ ఎత్తివేయకపోతేనే మంచిదనే సూచన చేసింది.లాక్‌డౌన్ కొనసాగించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని కొంతమంది వెల్లడిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. అన్ని వ్యవస్థలు కుదేలవుతాయి. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశముంది. అయినా ఇవన్నీ ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమేమికాదని, ఒక్క ప్రాణం పోయినా మళ్లీ తిరిగి తీసుకొస్తామా అనే ప్రశ్నలు వినిపిస్తున్నయి.
ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తే.. కొన్నాళ్లపాటు కష్టపడి గాడిలో పెట్టొచ్చు. కానీ ప్రాణాలు పోతే మాత్రం తీసుకురాలేము. అందుకే పలు సంస్థలు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చే వరకు కొనసాగించాలని ఘంటాపథంగా చెబుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తెలియాలంటే ఈనెల 14 వరకు ఎదురు చూడాల్సిందే.
భారత్ - అమెరికా మధ్య హైడ్రాక్సీ క్లోరోక్విన్ చిచ్చు
హైడ్రాక్సీ
క్లోరోక్విన్ మాత్రలు భారత్ - అమెరికాల మధ్య చిచ్చుపెట్టేలా
కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు
వస్తున్నాయి. కరోనాపై పోరాటానికి ఆ మాత్రలను తమకు భారీగా పంపించాలని
అమెరికా కోరుతోంది. దీనిపై ట్రంప్ మోదీతో ఫోన్‌లో కూడా మాట్లాడారు. ఇటు
భారత్ మాత్రం దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్దమొత్తంలో అమెరికాకు
ఎలా అందిస్తామని అంటోంది. దీనిపై త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకునే
అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ట్రంప్ మాత్రం భారత్ తీరుపై తన అసంతృప్తిని
బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంపై స్పందించారు. అమెరికాతో భారత్ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నారు. అదే సమయంలో ఒకవేళ మందుల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎగుమతిపై భారత్ నిషేధాన్ని ఎత్తివేయకపోతే దానికి ప్రతీకారం ఉంటుందని అన్నారు ట్రంప్.
కరోనా పరిస్థితులపై ఇరుదేశాధినేతలు ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని తమకు సరఫరా చేయాలని ట్రంప్ భారత్‌ను కోరారు. మలేరియాకు మందుగా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని వాడుతున్నారు. వీటి ధర కూడా పెద్ద ఎక్కువేం కాదు. అయితే ఈ మందు కరోనాను తరిమికొట్టడంలో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
దీంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పైనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఔషధం సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: 9 మంది ఉగ్రవాదుల హతం.. అమరుడైన ఓ జవాన్
కశ్మీర్‌లో మరోసారి భారీ సంఖ్యలో ఉగ్రవాదులన సైన్యం మట్టుబెట్టింది. దక్షిణ
కశ్మీర్‌లోని కుల్గామ్‌లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు
ఉగ్రవాదులు హతం కాగా.. ఆదివారం కెరాన్ సెక్టార్‌లో మరో ఐదుగురు ఉగ్రవాదులను
భద్రత బలగాలు తుదముట్టించాయి. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో నలుగురు పౌరులు ప్రాణాల కోల్పోయిన
తర్వాత భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. కుల్గామ్‌లో హిజ్బుల్
ముజాయిద్దీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం
తెల్లవారుజామున కెరాన్ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు.
దీంతో అప్రమత్తమైన సైన్యం ముష్కరుల చర్యలను సమర్ధంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ
కాల్పుల్లో ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోగా, ఒరో ఇద్దరు గాయపడ్డారు.
ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. గడచిన 12 రోజుల్లో
ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లో పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో
నలుగురు పౌరులు చనిపోయారు. శనివారం ఎన్‌కౌంటర్‌లో హతమైన హిజ్బుల్
ముజాయిద్దీన్ ఉగ్రవాదులు.. బుధవారం కుల్గామ్‌లో ఇద్దరు పౌరులను
హత్యచేశారని అధికారులు తెలిపారు.
శనివారం వేకువజామున కుల్గామ్ జిల్లా హర్దమంగూరి బతాపొరా వద్ద
ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు
చేరుకున్నాయి. ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్,
పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ
సమయంలో భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన
సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది
ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి 9 నిమిషాలు దివ్వెలు వెలిగించండి.. మోదీ వీడియో సందేశం
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి, తలుపులు మూసేసి గుమ్మం ముందు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని సూచించారు. దేశ ప్రజలంతా బాల్కనీలోకి వచ్చి కొవ్వెత్తులు, ప్రమిదలతో దివ్వెలను వెలిగించి, కరోనాను తిప్పికొడతామని సంకల్పం తీసుకోవాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ సంకట సమయంలో భారతీయులకు ఇది శక్తి, ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేదని.. అందరూ కలిసి వచ్చి.. కరోనాను ఎదుర్కొండని కోరారు. కరోనా పై యుద్ధంలో అందరూ సహకరించాలని ప్రధాని మోదీ మరోసారి అభ్యర్థించారు.
లైట్లు ఆపేసి వీధుల్లోకి రాకుండా, గుమ్మం ముందు నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కవ్వోత్తులను వెలిగించాలని మోదీ కోరారు. సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను వెలిగించాలని, ఈ సమయంలో వీధుల్లోకి మాత్రం ఎవరూ రావద్దని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అమలు అవుతున్న లాక్‌డౌన్‌ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment