తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి సడలింపులు లేవని స్పష్టం చేశారు.
లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.సంచలన నిర్ణయం ప్రకటించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను
పొడిగించారు. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు.
ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
తీసుకుందని.. కానీ, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ స్థితిగతులపై
మంత్రులు, అధికారులతో ఆదివారం (ఏప్రిల్ 19) సుదీర్ఘంగా చర్చించిన సీఎం
కేసీఆర్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్
వివరించారు. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అంతర్జాతీయ అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. మే
5న మంత్రివర్గ సమావేశంలో మరోసారి పరిస్థితిని సమీక్షించి లాక్‌డౌన్‌పై
నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని
కేసీఆర్ కోరారు.
No comments:
Post a Comment